క్రిబ్కో (క్రిషక్ భారతి కోఆపరేటివ్ లిమిటెడ్) నూతన ఛైర్మన్‌గా తెలుగు వ్యాపారవేత్త వల్లభనేని సుధాకర్ చౌదరి ఎన్నికయ్యారు. మొన్నటివరకు వైస్ ఛైర్మన్‌గా ఉన్న సుధాకర్ చౌదరి.. సోమవారం జరిగిన క్రిబ్కో ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలానే డాక్టర్ చంద్రపాల్ సింగ్ యాదవ్ వైస్ ఛైర్మన్ పదవిని దక్కించుకున్నారు. ఈ రెండు అత్యున్నత పదవులకు ఒకే నామినేషన్లు దాఖలు కావడంతో.. ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. నూతన ఛైర్మన్ సుధాకర్ చౌదరికి ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.…