ఐపీఎల్ 2025లో భాగంగా మంగళవారం ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ 16 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 112 పరుగుల స్వల్ప ఛేదనలో కేకేఆర్ 15.1 ఓవర్లకు 95 పరుగులకే ఆలౌటై దారుణ ఓటమిని ఖాతాలో వేసుకుంది. మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ తన స్పిన్ మాయాజాలంతో 4 వికెట్లు పడగొట్టి కోల్‌కతా పతనాన్ని శాసించాడు. అయితే కోల్‌కతా కెప్టెన్ అజింక్య రహానే రివ్యూ తీసుకోకపోవడం కేకేఆర్ విజయావకాశాలపై ప్రభావం…