ఏపీలో ఇటీవల ఖాళీ అయిన ఓ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు ప్రక్రియను ప్రారంభించారు. ఈ మేరకు ఇటీవల నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన మహ్మద్ కరీమున్నిసా మరణించగా ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఇటీవలే ఈసీ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ మేరకు గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో వైసీపీ అభ్యర్థిగా కరీమున్నిసా కుమారుడు రుహుల్లా నామినేషన్ దాఖలు చేశారు.…