హైదరాబాద్‌లో భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరుగుతోంది. ఈ సినిమాలో పాట పాడిన మొగులయ్యకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. ఈ నేపథ్యంలో మొగులయ్యను వేదికపై చిత్ర యూనిట్ సన్మానించింది. భీమ్లానాయక్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ, సంగీత దర్శకుడు తమన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మొగులయ్య మాట్లాడుతూ.. భీమ్లానాయక్ సినిమాలో తాను పాట పాడటం తన అదృష్టమని పేర్కొన్నారు. ఈ సినిమాలో తాను పాట పాడకపోతే తానెవరో ఎవరికీ తెలిసేది…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న ‘భీమ్లా నాయక్’ సినిమా నుంచి వచ్చిన మొదటి పాట విశేష ఆదరణ పొందింది. ఈ పాటతో తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా నల్లమల ప్రాంతానికి చెందిన కిన్నెర వాద్య కళాకారుడు మొగులయ్య పేరు ఒక్కసారిగా మార్మోగింది. ఈ పాటలో కిన్నెర వాయిద్యాన్ని వాయిస్తూ బీమ్లా నాయక్ పుట్టుపూర్వోత్తరాలు చెబుతూ ఆయన కనిపిస్తాడు. ఆడాగాదు ఈడాగాదు… అమీరోళ్ల మేడాగాదుగుర్రం నీళ్ల గుట్టాకాడ… అలుగూ వాగు తాండాలోనబెమ్మా…