తెలుగు సీనియర్ హీరో రెబల్ స్టార్, కేంద్ర మాజీ మంత్రివర్యులు స్వర్గీయ కృష్ణంరాజు గారి జయంతి సందర్భంగా ఈ నెల 20వ తేదీన ఆయన స్వస్థలం మొగల్తూరులో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. యూకే ఇండియా డయాబెటిక్ ఫుట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ వేణు కవర్తపు సారథ్యంలో, కృష్ణం రాజు గారి సతీమణి శ్యామలాదేవి, కూతురు ప్రసీద ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరానికి వెయ్యి మందికి పైగా పేషెంట్స్ హాజరయ్యారు.…