నిన్న రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడిన రాజస్థాన్ రాయల్స్ ‘డబుల్ ధమాకా’ కొట్టింది. తొలుత చెన్నైని 150 పరుగులకే కట్టడి చేసి ప్లేఆఫ్స్‌లో బెర్తు కన్ఫమ్ చేసుకున్న రాజస్థాన్.. ఆ తర్వాత విజయం సాధించి, పాయింట్ల టేబుల్‌లో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. లీగ్ దశలో టాప్-2లో నిలిచిన జట్టుకి.. ప్లేఆఫ్స్‌లో ఒక మ్యాచ్ ఓడినా, మరో అవకాశం ఉంటుందన్న సంగతి తెలిసిందే! లక్నో సూపర్ జెయింట్స్ కూడా 18 పాయింట్లు సాధించినా.. మెరుగైన రన్‌రేట్‌తో…
ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. మొయిన్ అలీ 93 పరుగులతో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అయితే మిగతా ఆటగాళ్లు కనీస పోరాటపటిమ కూడా చూపించలేదు. కెప్టెన్ ధోనీ 26 పరుగులు చేశాడు. చెన్నై బౌలర్లలో చాహల్, ఒబెడ్ మెకాయ్ రెండేసి వికెట్లు సాధించగా.. ట్రెంట్ బౌల్ట్, రవిచంద్రన్ అశ్విన్ చెరో వికెట్…
ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో ఓటమి ఎదురై నిరాశలో ఉన్న చెన్నై సూపర్‌కింగ్స్ టీమ్‌కు గుడ్ న్యూస్ అందింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ తాజాగా జట్టులో చేరాడు. వీసా నిబంధనల్లో సాంకేతిక సమస్యల కారణంగా తొలి మ్యాచ్‌కు దూరమైన మొయిన్ అలీ రెండో మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్నాడు. 2021లో చెన్నై టైటిల్ గెలవడంలో మొయిన్ అలీ కీలక పాత్ర పోషించాడు. అందుకే ఈ ఏడాది చెన్నై యాజమాన్యం రుతురాజ్ గైక్వాడ్, ధోనీ, జడేజాలతో పాటు…
ఐపీఎల్-15 సీజన్ ప్రారంభానికి ముందే డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరగనున్న తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండేది అనుమానంగా మారింది. ఎందుకంటే మొయిన్ అలీకి వీసా సమస్యలు వచ్చిపడ్డాయి. దీంతో అతడు ఇండియా రావడానికి ఇప్పటిదాకా వీసా లభించలేదని తెలుస్తోంది. మొయిన్ అలీ ప్రస్తుతం ఇంకా ఇంగ్లండ్‌లోనే ఉన్నాడు. ఈ అంశంపై చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథ్…