ఉగ్రవాదులకు ప్రధాన స్థావరాలైన బహావల్‌పుర్, మురుద్కేపై భారత సైన్యం మెరుపు దాడి చేసి బీభత్సం సృష్టించింది అని నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదులు, ఉగ్రవాద సానుభూతిపరులకు భారత్ ఏం చేస్తుందో క్లియర్ గా చెప్పింది అన్నారు. పాకిస్తాన్ గర్వంగా చెప్పుకునే డ్రోన్లు, మిసైల్లను పూర్తిగా ధ్వంసం చేశాం.
ఉగ్రవాదులను మట్టిలో కలిపేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. దేశ మహిళల సింధూరాన్ని దూరం చేస్తే ఏం జరుగుతుందో పాకిస్తాన్ కు చూపించాం అని చెప్పుకొచ్చారు. ఆపరేషన్ సింధూర్ ఒక పేరు కాదు.. ఒక ఆవేదన.. ఆపరేషన్ సింధూర్ న్యాయం కోసం చేసిన ఓ ప్రతిజ్ఞ అని కొనియాడారు.
మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది విక్టరీ ర్యాలీపై సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఈ సదర్భంగా ఓ నెటిజన్ ఇలా రాసుకొచ్చాడు.. 11 పాకిస్తాన్ వైమానిక స్థావరాలు, 26 ఉగ్రవాద లక్ష్యాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) లాంగ్ రేంజ్ వైమానిక జరిపిన దాడులను షాహిద్ అఫ్రిది సెలబ్రేట్ చేసుకోవడం ఆనందంగా ఉంది.. ప్రస్తుతం, అతని మానసిక పరిస్థితి బాగాలేదు తక్షణమే చికిత్స అందించాల్సిన అవసరం ఉందన్నాడు.