తెలంగాణ విషయంలో మోడీ వ్యాఖ్యలు రాజకీయాలను వేడెక్కించాయనే చెప్పాలి. తెలంగాణ విషయంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటలయుద్ధం కొనసాగుతూనే వుంది. తాజాగా కాంగ్రెస్ తెలంగాణ ఇంచార్జి, మానిక్కం ఠాకూర్ వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కౌంటర్ ఇచ్చారు. నాటిఉద్యమ నాయకులు , సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రజా పోరాటం ద్వారా తెలంగాణ రాష్ట్రం వచ్చింది కానీ ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల కాదు. అహింసా మార్గంలో కేసీఆర్ చేపట్టిన పోరాటంలో ప్రజలంతా ఆయనతో కలిసి రావడం, ఆనాడు ప్రభుత్వంలో…