Maoist Party: మావోయిస్టు ఉద్యమంలో కీలకమైన మార్పుకు సూచించే ప్రకటన వెలువడింది. ఎంఎంసి జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో విడుదల చేసిన ప్రకటనలో జనవరి 1 నుంచి సాయుధ కాల్పుల విరమణకు సిద్ధమయ్యామని మావోయిస్టు పార్టీ వెల్లడించింది. ఎవరికి వారు వ్యక్తిగతంగా లొంగిపోయే బదులు సమూహంగా ముందుకు రావడానికి సిద్ధమయ్యాం అని ప్రకటనలో పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.