తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని తన అనుచరులకు రవీందర్ రావు చెప్పుకొచ్చారు. మేం అందరం.. సీఎం కేసీఆర్ కోసం పనిచేస్తున్నాం.. కానీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కోసం పనిచేయబోమని ఎమ్మెల్సీ రవీందర్ రావు వర్గీయులు అంటున్నారు. తాము శంకర్ నాయక్‌తో కలిసి తిరిగినా జనం ఓట్లు వేయరని వారు పేర్కొన్నారు. శంకర్ నాయక్‌ను నియోజకవర్గ ప్రజలు నమ్మడం లేదని.. ఆయన తప్పకుండా ఈ సారి ఎన్నికల్లో ఓడిపోతారని ఎమ్మెల్సీ అనుచరులు చెప్పారు.