గవర్నర్ కోటా రెండు ఎమ్మెల్సీల భర్తీపై తమిళిసై కీలక నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోటా కింద ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ నిర్ణయించారు. తమ ఎమ్మెల్సీ నామినేషన్ల తిరస్కరణను సవాల్ చేస్తూ బీఆర్‌ఎస్ నేతలు దాసోజు శ్రవణ్ కుమార్, కె. సత్యనారాయణ దాఖలు చేసిన రెండు పెండింగ్‌లో ఉన్న రిట్ పిటిషన్ల నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఆ…