బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి ప్రకటించారు. విలువలు లేని చోట తాను ఉండలేనని ఆయన పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రియాంకగాంధీ త్వరలోనే నాగర్ కర్నూలులో జరిగే బహిరంగ సభలో కాంగ్రెస్ తీర్థం తీసుకోనున్నట్లు దామోదర్ రెడ్డి వెల్లడించారు. బీఆర్ఎస్ ద్వారా దక్కిన ఎమ్మెల్సీ పదవికి కూడ ఆయన రాజీనామా చేయనున్నారు.