స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవాల పర్వం కొనసాగుతోంది… వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్ది మినహా అందరూ నామినేషన్లు ఉపసహరించుకోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది.. దీంతో వరంగల్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ స్థానాన్ని టీఆర్ఎస్ మరో సారి నిలబెట్టుకుంది. ఉమ్మడి జిల్లాలోని స్థానిక సంస్థల్లో మెజారిటీ ఉన్న టీఆర్ఎస్ ఈ కోటాలో మండలి స్థానాన్ని ఏకగ్రీవం చేసుకునేందుకు వేసిన ఎత్తుగడలు…