ఏపీలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కలకలం రేపుతోంది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఘాటుగా స్పందించారు. మాజీ డీజీపీ సవాంగ్ మార్క్ పోలీసింగ్ నుంచి రాష్ట్ర పోలీసు వ్యవస్థ బయటపడాలి. ప్రశ్నించే గొంతులను ఎందుకు నొక్కుతున్నారు? దళితుల హత్య అంటే తేలిగ్గా తీసుకోవద్దని డీజీపీకి తెలుపుతున్నాను. తూర్పు గోదావరి నుంచి సుబ్రహ్మణ్యం అనే మరో దళితుడు ఎమ్మెల్సీ అనంత బాబు చేతిలో బలైపోయాడు. సుబ్రమణ్యం మరణానికి అసలు కారణాన్ని అన్వేషించాలి. ఎమ్మెల్సీ అనంత బాబు…
కాకినాడలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కాకినాడ ఎమ్మెల్సీ అనంతబాబు వద్ద డ్రైవర్‌గా పనిచేసిన సుబ్రహ్మణ్యం అనుమానస్పదంగా మృతి చెందడంతో పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఘటన జరిగి 48 గంటలు దాటిపోవస్తున్నా ఇంకా పోస్టుమార్టంకు కుటుంబ సభ్యులు ససేమిరా ఒప్పుకోవడం లేదు. సుబ్రహ్మణ్యం హత్య పట్ల కాకినాడ పట్టణంలో పలు పార్టీలకు చెందిన నాయకులు నిరసన తెలియజేస్తున్నారు. టీడీపీ నిజనిర్దారణ కమిటీ వేసిన సంగతి తెలిసిందే. టీడీపీ నిజనిర్దారణ కమిటీ సభ్యులుగా మాజీ మంత్రి పితాని…