బిల్కిస్ బానో అత్యాచారం కేసులో దోషుల్లో ఒకరు శనివారం గుజరాత్ లో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేతో వేదిక పంచుకున్నారు. ఈ విషయంపై భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా ట్విట్టర్ వేదికగా స్పందించారు.