కొత్తపల్లి సుబ్బారాయుడు. రాజకీయంగా దిట్ట అనేది ఒకప్పటి మాట. కొత్త పార్టీల ఎంట్రీతో మారిన రాజకీయాలను అంచనా వేయలేక ఇప్పుడు సాధారణ నాయకుడిగా మిగిలిపోయారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నుంచి వరసగా గెలుస్తూ అదే స్పీడ్‌లో ఉన్నత పదవులు అందుకున్నారు. అప్పటి వరకు జిల్లా రాజకీయాలను కనుసైగతో శాసించేవారు. అలాంటిది 2009 నుంచి ఆయన అంచనాలు సరిగ్గా వర్కవుట్ కాలేదనే చెప్పాలి. అప్పుడు మొదలైన రాజకీయ పతనం.. కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు రాజకీయంగా నిలదొక్కుకోవడానికి.. ఉనికి కాపాడుకోవడానికి…