MLA Prakash Goud: ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ యూటర్న్.. కాంగ్రెస్‌కు షాక్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Prakash Goud: కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానంటూ ప్రకటించిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.. ఇప్పుడు ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరబోనని స్పష్టం చేశారు. నిన్న సాయంత్రం, ఈరోజు ఉదయం తన కేడర్ తో సమావేశమయ్యారు ప్రకాష్ గౌడ్.. అయితే, ప్రజల నుండి వ్యతిరేకత వస్తుందని ఎమ్మెల్యే ప్రకాష్ కు సూచించారు పలువురు నేతలు.. దీంతో, తాత్కాలికంగా కాంగ్రెస్ పార్టీలో చేరే విషయాన్ని విరమించుకొని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వెనుకడుగు వేశారు.. కార్యకర్తల సూచన మేరకు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు..
Read Also: BC Janardhan Reddy: బనగానపల్లె కోటపై టీడీపీ జెండా ఎగరడం ఖాయం..!
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
అయితే, శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.. నియోజకవర్గానికి సంబంధించి పలు సమస్యల గురించి చర్చించినట్లు తెలిపారు.. తనను కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించినట్టు వెల్లడించారు.. నియోజకవర్గ ప్రజలను, కార్యకర్తలను, నాయకులతో సమావేశమై వారు సూచన మేరకు నిర్ణయం తీసుకుంటానని చెప్పారట.. అయితే శనివారం రాజేంద్రనగర్ నియోజకవర్గం ముఖ్య బీఆర్ఎస్ నాయకులతో సమావేశం చర్చలు జరిపారు.. బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లోకి వెళ్తే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని.. ఉద్యమం నుండి పార్టీలో పనిచేసిన తమకు చెడ్డ పేరు వస్తుందని రాజేంద్రనగర్ నియోజకవర్గం కేడర్ ఆయన చెప్పారట.. దీంతో, ప్రస్తుతం పార్టీని వీడడం తన కేడర్‌కు ఇష్టం లేదని.. వారికి ఇష్టంలేని పని తాను ఎప్పటికీ చేయనని.. అందుకే బీఆర్ఎస్ పార్టీని వీడేది లేదని.. పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.. బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ రాజేంద్రనగర్ నియోజకవర్గం ప్రజలకు సేవ చేస్తానని.. పార్టీ మారే ఉద్దేశం తనకు లేదని తేల్చేశారు.. నియోజకవర్గ ప్రజలు ఆందోళన చెందవద్దని మీ వెంట నేనున్నానని.. ఎలాంటి సమస్య వచ్చినా తన దృష్టికి తేవాలని అందరికీ న్యాయం జరిగేలా చూస్తానని ఈ సందర్భంగా ప్రకటించారు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. అయితే, ప్రకాష్ గౌడ్ యూ టర్న్ తీసుకుని బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేయడంతో.. కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలినట్టు అయ్యింది.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!