నాపై కేసు వెనుక కాంగ్రెస్, బీజేపీ కుట్ర దాగిఉందని ఆరోపించారు బీఆర్ఎస్ తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి.. మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేసిన విషయంపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు రోహిత్‌రెడ్డి.. మాపై మొయినాబాద్ పీఎస్‌లో ఫిర్యాదు కాంగ్రెస్, బీజేపీ కుట్రగా అభివర్ణించారు.. మేం పార్టీ మారితే.. నాలుగేళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఏమి చేసింది? అని నిలదీసిన ఆయన.. రాజ్యాంగబద్ధంగా బీఆర్ఎస్‌లో 12 మంది ఎమ్మెల్యేలం కాంగ్రెస్ పార్టీ నుంచి విలీనం అయ్యామని…
ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి రిట్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ చేపట్టనుంది. ఈడీ దర్యాప్తును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరపనుంది. ఈడీ దర్యాప్తుపై స్టే విధించాలన్న రోహిత్‌రెడ్డి పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే.. ఈ కేసులో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది.
నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కలకలం సృష్టించింది.. దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది.. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం నియమించిన సిట్ దూకుడు పెంచింది.. అయితే, ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్న తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి చుట్టూ వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఆయనకు బెదిరింపులు రావడంతో.. అదనపు భద్రత కూడా కేటాయించారు.. అయితే, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం జరిగిన 20 రోజుల తర్వాత తొలిసారి రేపు సొంత నియోజకవర్గం తాండూరుకి రాబోతున్నారు ఎమ్మెల్యే…