నర్సాపూర్ లో ఎమ్మెల్యే మదన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ నెల 21న ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో నర్సాపూర్ టికెట్ పెండింగ్ లో పార్టీ అధిష్టానం పెట్టింది. గత వారం నుంచి ఎమ్మెల్యే వరుసగా ఆందోళనలు చేస్తున్నారు.
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాలకు గానూ 115 స్థానాలకు అభ్యర్థుల జాబితాను సోమవారం ప్రకటించారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నారు. breaking news, latest news, telugu news, mla madan reddy, cm kcr,
ఉమ్మడి మెదక్ జిల్లాలోని నర్సాపూర్ టీఆర్ఎస్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఒకవైపు ఎమ్మెల్యే మదన్‌రెడ్డి.. ఇంకోవైపు మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ఇక్కడ వేగంగా పావులు కదుపుతున్నారు. సునీతా లక్ష్మారెడ్డి గతంలో మూడుసార్లు నర్సాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 2014, 2019లో టీఆర్ఎస్ అభ్యర్థి చిలుముల మదన్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణాల్లో భాగంగా టీఆర్‌ఎస్ కండువా కప్పుకొన్నారు…