కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికిరాదని.. ఆ ప్రాజెక్ట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హనుమకొండ జిల్లా పర్యటనలో కూనంనేని ఈ వ్యాఖ్యలు చేశారు.
నాలుగు నెలలుగా గత ప్రభుత్వ పాపాలను కాంగ్రెస్ ప్రభుత్వం వెలికి తీస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు అన్నారు. పాత నేరాలన్ని ఒక్కోటి బయటకు వస్తున్నాయి.. ఒక వైపు హామీల అమలు జరుపుతూనే , కేసీఆర్ పాపాల ప్రక్షాళన చేస్తుంది కాంగ్రెస్.. బీజేపీ, కేసీఆర్ రైతు దీక్షలు చూసి సమాజ�