వనమాడి వెంకటేశ్వరరావు అలియాస్ కొండబాబు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే. ఆరు సార్లు పోటీ చేసి మూడు విడతలు గెలిచారాయన. కానీ... ఈసారి తాను గెలిచి, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ఆయన వైఖరి కాస్త మారినట్టు కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. నియోజకవర్గంలో జరుగుతున్న వ్యవహారాల్లో ఎక్కడా పార్టీ నాయకులు ఇన్వాల్వ్ కావద్దని చెబుతున్నారట ఎమ్మెల్యే.
కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ భావనపై మున్సిపల్ మంత్రి నారాయణకి ఫిర్యాదు అందింది.. మంత్రి నారాయణకు ఫోన్ చేసిన ఎమ్మెల్యే కొండ బాబు.. కమిషనర్ భావనపై ఫిర్యాదు చేశారు.. వివాదాస్పద స్థలం బయో మెథనేషన్ ప్లాంట్‌కి కేటాయించడంపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. గతంలో ద్వారంపూడి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తక్కువ ధర భూమికి వందల కోట్లు టీడీఆర్ బాండ్లు కేటాయించారని ఆరోపణలు చేశారు కొండబాబు.