ఎమ్మెల్యే కొలికపూడి టీడీపీ అధిష్టానానికి కొరుకుడు పడటం లేదా? ఏకంగా పార్టీకే డెడ్‌లైన్ పెట్టి అల్టిమేటమ్ ఇవ్వడాన్ని ఎలా చూడాలి? ఆయన ఇన్నాళ్ళు చేసిన రచ్చ ఒక ఎత్తు, తాజా వివాదం మరో ఎత్తులా ఉండబోతోందా? ఎమ్మెల్యే వాఖరి మీద పార్టీ పెద్దలు సీరియస్‌గానే ఉన్నారా? తిరువూరు ఎమ్మెల్యే గురించి టీడీపీలో ఏమని మాట్లాడుకుంటున్నారు? ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అమరావతి ఆందోళనల్లో చురుగ్గా పాల్గొనడం, ఎగ్రెసివ్ నేచర్‌తో సీఎం చంద్రబాబు దృష్టిని ఆకర్షించారు కొలికపూడి శ్రీనివాస్.…