పవన్ కల్యాణ్ ను మంచి మానసిక వైదుడుకి, ఎర్రగడ్డ ఆసుపత్రిలో చూపించాలనే అనుమానం వస్తుంది అని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. వ్యాధి ముదిరితే ప్రాణాంతకం అవుతుంది.. పోటీ చేసిన తర్వాత భీమవరం మొహం మళ్ళీ చూడలేదు.. కోవిడ్ సమయంలో ప్రజలు ఏం అయిపోయారు అనేది కూడా చూడలేదు..
భీమవరం సభపై సస్పెన్స్ క్రియేట్ చేసిన పవన్ కల్యాణ్.. తన ప్రసంగాన్ని తుస్సుమనిపించారు అంటూ సెటైర్లు వేశారు.. యువకులు, రైతులు, శ్రామికులు మోసపోతున్నారు అంటూ అబద్దాలు ఆడారు.. జనసేన అంటే ప్యాకేజీ పార్టీ.. అబద్దాల పార్టీ అంటూ విమర్శించారు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్
భీమవరంలోని ఓటర్లు ఎంత మంది ఉంటారు, ఎన్నిక విధానం లాంటివి కూడా పవన్ కల్యాణ్‌కు తెలియదని విమర్శించారు.. ఇక, సినిమా వాళ్లకి ప్రజల్లో ఆదరణ ఉంటుంది.. యాంకర్ అనసూయ రాజమండ్రి వచ్చినా జనం కిక్కిరిసిపోతారంటూ కామెంట్ చేశారు.
Off The Record: గ్రంధి శ్రీనివాస్. భీమవరం ఎమ్మెల్యే. రాష్ట్రం దృష్టిని ఆకర్షించేలా గత ఎన్నికల్లో నెంబర్ వన్ విజయాన్ని సాధించినా గుర్తింపు విషయంలో ఆయన స్థానం ఎన్నో నెంబరో అర్ధం కావడం లేదట. రెండుసార్లూ మంత్రివర్గంలో చోటు దక్కలేదు. ఆ విషయంలో అసంతృప్తి లేకపోయినా జరుగుతున్న పరిణామాలు మాత్రం ఆయన్ని ఆవేదనకు లోను చేస్తున్నాయట. అధినేతని ఒప్పించి.. జనాన్ని మెప్పించినా రావాల్సిన గుర్తింపు ఇంకా దక్కలేదని గ్రంధి అనుచరుల్లోనూ అసంతృప్తి ఉందట. గ్రంధికి ప్రాధాన్యం లేకపోవడం…
మంత్రి వర్గ విస్తరణలో అవకాశం దక్కకనినేతల అసంతృప్తి ఇంకా చల్లారినట్టు కనిపంచడంలేదు.. ముఖ్యంగా పశ్చిమగోదావరిజిల్లా నేతల్లో అసంతృప్తి సెగ పొగలుగక్కుతోంది. చాపకింద నీరులా వ్యాపించి ఓట్లేసిన జనంలో దృష్టిలో చులకన చేస్తోంది. తాజాగా భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ వ్యవహరంలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. భీమవరంలో వైసీపీ జిల్లా పార్టీ మీటింగ్ రసాభాసగా మారడం మంత్రి వర్గవిస్తరణలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కు చోటు దక్కకపోవడం ఎంతటి అసంతృప్తిని మిగిల్చిందో బయటపెట్టింది. పార్టీని మరింత…