తుపాను కారణంగా ఏపీలో భారీ వర్షాలు కుమ్మేస్తున్నాయి. ఆధ్యాత్మిక నగరం తిరుపతి అల్లాడుతోంది. తుపాన్ తీవ్రత కొనసాగుతున్నప్పటికీ, దాన్ని ఎదుర్కొనేందుకు తిరుపతిలో యంత్రంగం సిద్ధంగా ఉందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. తిరుపతిలో తుపాన్ ప్రభావంతో దెబ్బ తిన్న ప్రాంతాలలో ఆయన సుడిగాలి పర్యటన చేపట్టారు. జోరు వాన, గాలిని సైతం లెక్కచేయకుండా కలియదిరిగారు. లక్ష్మీపురం కూడలి వద్ద మోకాలి లోతైన నీటిలో తిరుగుతూ ప్రజలను అప్రమత్తం చేశారు. అశోక్ నగర్ వద్ద చెట్టు…