ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో ఎలిమినేటర్ మ్యాచ్‌కు రంగం సిద్దమైంది. ఇవాళ ( బుధవారం ) చెన్నై వేదికగా జరగనున్న ఈ కీలక పోరులో లక్నో సూపర్ జెయింట్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు మే 26న జరగనున్న క్వాలిఫియర్-2లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది.