కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు శాలరీలు టైమ్ కు ఇవ్వడానికి సైతం వెనకాడుతుంటాయి. నెలంతా పనిచేసి శాలరీ ఎప్పుడొస్తుందో అని ఉద్యోగులు ఎదురుచూస్తుంటారు. శాలరీ గురించి అడిగినా సరైన సమాధానం చెప్పరు. ఇక ఇంక్రిమెంట్స్ సంగతి దేవుడెరుగు.. వచ్చే జీతం టైమ్ కు వస్తే చాలు అని అనకుంటుంటారు. అయితే ఓ సంస్థ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. సంస్థ ఉన్నతికి కృషి చేస్తున్న తమ ఉద్యోగులకు శాలరీలే కాకుండా పండగ వేళ కార్లను బహుమతిగా ఇస్తూ…