లిక్కర్ స్కాం కేసులో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ఏ4గా ఉన్నారు. గతంలో ఒకసారి సిట్ విచారణకు హాజరయ్యారు. తాజాగా మరోసారి సిట్ విచారణకు హాజరు కాగా.. ఆయన్ని అరెస్ట్ చేశారు. రేపు కోర్టులో మిథున్ రెడ్డిని సిట్ హాజరుపర్చనుంది. అరెస్ట్‌పై ఎంపీ కుంటుంబానికి సిట్ సమాచారం అందించింది. మరోవైపు.. కేసు ఛార్జిషీటులో ఎంపీ మిథున్ రెడ్డి పేరును చేర్చడంతో ఆయన ఏపీ హైకోర్టులో ముందుస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. ఆ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో సుప్రీం కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేయగా.. విచారణ చేపట్టి ధర్మాసనం.. కీలక వ్యాఖ్యలు చేసింది. అసలు వ్యక్తిని అరెస్ట్ చేయకుండా కేసులో ఛార్జ్‌షీట్ ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నించింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.
READ MORE: Hari Hara Veeramallu: వామ్మో సినిమా కోసం పవన్ అండ్ టీమ్.. ఇంత కష్టపడ్డారా?
ఇదిలా ఉండగా.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం జరిగింది. ఈ నేపథ్యంలోనే కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇవాళ (జూలై 19న) సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఉదయం 9.30 గంటలకు ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఆయన 10 గంటలకు విజయవాడలోని సిట్ ఆఫీసుకు వెళ్లారు. విచారణ తర్వాత మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు పర్మిషన్ ఇవ్వాలని సిట్ కోరగా.. అందుకు ఏసీబీ కోర్టు నిరాకరించింది. అయినప్పటికీ ఆయనను అరెస్ట్ చేశారు.