కర్నాటకలోని పవిత్ర పుణ్యక్షేత్రం ధర్మస్థల.. పశ్చిమ కనుమల్లోని ఈ ప్రాంతం మంజునాథ స్వామి ఆలయంతో ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతుంది. నిత్యం వేలాదిమంది భక్తులు ఇక్కడ స్వామి దర్శనం కోసం తరలివస్తారు. కానీ, ఈ పవిత్ర భూమి ఇప్పుడు భయంకర ఆరోపణలతో కలకలం రేపుతోంది. రెండు దశాబ్దాలుగా వందలాది మంది హత్యకు గురయ్యారని, లైంగిక వేధింపులు జరిగాయని ఓ పారిశుద్ధ్య కార్మికుడు చేసిన ఫిర్యాదు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ హత్యల వెనుక ఎవరున్నారు? ఇన్నాళ్లూ ఈ రహస్యం…