తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మంగా మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించడానికి సిద్దమైంది. మరికాసేపట్లో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్ ప్రారంభ వేడుకలను అట్టహాసంగా ఆరంభం కానున్నాయి. మిస్ వరల్డ్ పోటీల కోసం విజిటర్స్ గేట్స్ శనివారం సాయంత్రం 5.30కు తెరుచుకున్నాయి. సాయంత్రం 6.30కు ఇనగ్యూరల్ సెరెమనీ ప్రారంభం కానుంది. అందాల పోటీల ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. మే 10న ప్రారంభమయ్యే పోటీలు.. మే 31 వరకు కొనసాగనున్నాయి.…
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా చూసే కార్యక్రమాల్లో మిస్ వరల్డ్ ఒకటి. కోట్లాది మంది ఈ వేడుకలను చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇలాంటి వేడుకలకు ఈసారి మన హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఇప్పటికే విశ్వనగరంగా పేరొందిన మన భాగ్యనగరం పేరు.. మిస్ వరల్డ్ వేడుకలతో మరోసారి ప్రపంచవ్యాప్తంగా మార్మోగడం ఖాయం. అయితే నాణేనికి మరోకోణం ఉన్నట్టే మిస్ వరల్డ్ వేడుకలకు కూడా మరో కోణం ఉంటుంది. అనేక వివాదాలు ఈ ఈవెంట్ చుట్టూ ఉంటాయి. ఆ విషయాన్ని పక్కన…