హైదరాబాద్ నగరంలోని హిమాయత్‌నగర్‌లో మిస్ తెలంగాణ-2018 విజేత హాసిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సోషల్ మీడియా లైవ్‌లోనే ఆమె ఈ ఘటనకు పాల్పడగా ఈ వీడియో చూసిన స్నేహితులు అప్రమత్తమై డయల్ 100కు సమాచారం అందించారు. నారాయణగూడ పోలీసులు స్పందించి వెంటనే హిమాయత్ నగర్ రోడ్ నం.6లోని యువతి ఫ్లాట్‌కు చేరుకుని ఆమెను రక్షించారు. ప్రస్తుతం హాసిని హైదర్‌గూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె క్షేమంగానే ఉందని పోలీసులు తెలిపారు. Read Also: తీవ్రమయిన వెన్నునొప్పితో…