జీనత్ అమన్.. ఈ పేరు 1970లలో ఎంతోమంది సరసులకు ఓ మంత్రం! జీనత్ పేరే జపిస్తూ ఆమె అందాలను ఆరాధిస్తూ, తెరపై ఆ శృంగార రసాధిదేవతను చూసి, ఆమెను తమ స్వప్న సామ్రాజ్యాలకు మహారాణిగా పట్టాభిషేకం చేసుకున్నారు. అలాంటి వారు ఈ నాటికీ ఆ నాటి జీనత్ అందాలను తలచుకుంటూ మురిసిపోతున్నారు. జీనత్ కు 70 ఏళ్ళు నిండాయంటే వినడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఆమె చాలా రోజుల క్రితమే ముసలి పాత్రల్లోకి ఎంటరై పోయింది. అయినా, అభిమానులు…