వరంగల్ రైతులు కన్నెర్ర చేశారు. వ్యాపారుల మోసంపై ఆగ్రహం వ్యక్తం చేవారు. దీంతో ఏనుమాముల మార్కెట్లో ఉద్రిక్తత నెలకొంది. రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఏనుమాముల మార్కెట్లో ఉదయం మిర్చి భారీగా వచ్చింది. దీంతో వ్యాపారులు తేజ మిర్చికి రూ.17,200గా ధర నిర్ణయించారు. అనంతరం రూ.14 వేలలోపు ధరలు నిర్ణయిస్తూ కొనుగోళ్లకు దిగారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు మిర్చి యార్డు కార్యాలయంలోకి దూసుకెళ్లారు. ఒక కాంటను ధ్వంసం చేశారు. దీంతో అధికారులు ప్రాధేయపడగా..…
దేశంలో మిర్చి ఉత్పత్తిలో తెలుగు రాష్ట్రాల వాటా 60 శాతమని, ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటా 40 శాతమని బీజేపీ రాజ్యసభ సభ్యుడు, జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ చైర్మన్ జీవీఎల్ నరసింహారావు అన్నారు. “తామర తెగులు” కారణంగా ఏపీ తెలంగాణలో మిర్చి పంట దారుణంగా దెబ్బతిందని, ఆంధ్రప్రదేశ్ లో మిర్చి పంట సాగు 2 లక్షల హెక్టార్లకు పైగా ఉందన్నారు. తెలంగాణలో లక్ష ఎకరాలకు పైగా పంట సాగు జరిగిందని, 25 మంది శాస్త్రవేత్తలు, పంట నిపుణులతో…
హన్మకొండ, భూపాలపల్లి జిల్లాల్లో మంత్రి నిరంజన్‌రెడ్డి పర్యటించారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను నిరంజన్‌రెడ్డి పరిశీలించారు. పరకాల, నడికూడ, రేగొండ మండలాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. నిరంజన్ రెడ్డి వెంట మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఉన్నతాధికారులు ఉన్నారు. వర్షాలతో నష్టపోయిన రైతులతో నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు లు మాట్లాడారు. రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలను మంత్రులు తెలుసుకున్నారు. నేలరాలిన మిర్చిపంటలను మంత్రులకు చూపిస్తూ.. సర్వం నష్టపోయామని, ఆదుకోవాలని రైతులు వేడుకున్నారు. తమను ఆదుకోవాలని మహిళా రైతులు…