చిన్నతనంలోనే వెండితెరపై అడుగుపెట్టి నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జా, ఇప్పుడు హీరోగా ఓ మైల్ స్టోన్ అందుకున్నారు. చూడాలని వుంది, రాజకుమారుడు, కలిసుందాం రా, ఇంద్ర వంటి సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా తన ప్రతిభను చాటిన తేజ, 2005లో బోన్సాయ్ చిత్రానికి ఉత్తమ బాల నటుడిగా నంది అవార్డును అందుకున్నారు. ఇప్పుడు హీరోగా కూడా అదే స్థాయిలో మెరుస్తున్నారు. హనుమాన్ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన తేజ, ఈ సినిమాతో పాన్ ఇండియా…