అవెంజర్స్, సూపర్‌మాన్, స్పైడర్‌మాన్ లాంటి సినిమాలు చూడడం అలవాటైన ఇండియన్ ఆడియన్స్‌కి మన దగ్గర కూడా ఒక సూపర్ హీరో ఉన్నాడు అని చూపించిన సినిమా ‘మిన్నల్ మురళి’. టొవినో థామస్ హీరోగా నటించిన ఈ మలయాళ సినిమా.. ఇండియన్ సూపర్ హీరో అనే థాట్‌ని అందరికీ రీచ్ అయ్యేలా చేసింది. ‘లైట్నింగ్’ పవర్‌తో సూపర్ హీరోగా మారిన ఒక సాధారణ యువకుడి కథలోకి, అదే పవర్ ఉన్న విలన్ కూడా వచ్చేస్తే… హీరోకి, విలన్‌కి ఒకే…