Inflation: పండుగల సీజన్‌లో మిఠాయిలకే ఎక్కువ ఖర్చు అవుతుంది. రక్షాబంధన్, జన్మాష్టమి, దసరా, దీపావళి సందర్భంగా మిఠాయిలకు గిరాకీ ఉండడంతో ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఈసారి సీన్‌లో కాస్త మార్పు కనిపిస్తోంది. బికనెర్వాలా, బికాజీ ఫుడ్స్, హల్దీరామ్ వంటి మార్కెట్లోని అగ్రశ్రేణి కంపెనీలకు చెందిన లడ్డూలు, మెత్తటి రసగుల్లాలు, శెనగపిండి బర్ఫీ వంటి స్వీట్ల తయారీకి అవసరమైన పదార్థాల ధరలు పెరిగాయి. కానీ పండుగ సీజన్ వినియోగదారులను జేబులకు చిల్లు పడేసే అవకాశాలు కనిపించడం లేదు.. ఇందుకు కారణం ఏంటో స్వీట్ మేకర్సే స్వయంగా చెప్పారు.
గతేడాదితో పోల్చితే ఈసారి ధరలు చాలా వరకు పెరిగాయి. కానీ స్వీట్ల ధరల్లో మాత్రం ఎలాంటి పెరుగుదల ఉండదని బికాజీ ఫుడ్స్ ఇంటర్నేషనల్ చీఫ్ ఆపరేషన్ ఆఫీసర్ మనోజ్ వర్మ తెలిపారు. సాధారణంగా ఆహార ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్నప్పటికీ భారతీయ సంప్రదాయ స్వీట్లను తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలు ఏడాది క్రితం కంటే చౌకగా ఉన్నాయి. ఇది ధరలను నియంత్రించడంలో దోహదపడుతుందని ఆయన అన్నారు. గతేడాదితో పోల్చితే డ్రైఫ్రూట్స్ ధరలు 10-12 శాతం పెరగ్గా, పండగ సందర్భంగా పామాయిల్ ధరలు గతేడాది కంటే తక్కువగా ఉండడంతో స్వీట్ తయారీదారులు, కొనుగోలుదారులకు మేలు జరుగుతోంది.
Read Also:Ramya Krishna : నేటి తరం హీరోయిన్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రమ్య కృష్ణ..
మరోవైపు, హోల్‌సేల్ మార్కెట్‌లో పాల ధర స్థిరంగా ఉంది. దీని కారణంగా నెయ్యి వంటి ఇతర ముఖ్యమైన పాల ఉత్పత్తులు చౌకగా మారాయి. అంతే కాకుండా ఈ సీజన్‌లో చక్కెర వాడకం కూడా పెరుగుతుంది. దీని ధరలో కూడా స్వల్ప పెరుగుదల కనిపించింది. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. ఆగస్టు 29 నాటికి చక్కెర టోకు ధర ఏడాది క్రితంతో పోలిస్తే 3.63 శాతం ఎక్కువ. కొన్ని వస్తువుల ధరలు పెరిగాయి. కొన్ని తగ్గుదల కనిపించాయి. ఈ కారణంగానే మిఠాయిల ధరలు పెరిగే అవకాశం లేకపోలేదు.
ఆగస్టులో ఓనం, రక్షాబంధన్‌తో ప్రారంభమై డిసెంబర్‌లో క్రిస్మస్ వరకు కొనసాగే అత్యంత ప్రజాదరణ పొందిన పండుగ సీజన్‌లో వినియోగదారులకు ఉపశమనం కలిగించడానికి స్వీట్ తయారీదారులు తమ వస్తువుల ధరలో ఏదైనా పెరుగుదలను గ్రహించాలని యోచిస్తున్నారు. బికానో, బికనెర్వాలా ఫుడ్స్ చీఫ్ ఆపరేషన్ ఆఫీసర్ పంకజ్ అగర్వాల్ మాట్లాడుతూ.. పరిశ్రమలో సవాళ్లు ఉన్నప్పటికీ ఈ సంవత్సరం ధరలను పెంచడం లేదని ఆయన చెప్పారు. ఈసారి తమ ఫోకస్ అంతా వినియోగదారులపైనే ఉంటుందన్నారు.
Read Also:Vijay: నాకు ఫస్ట్ అసలు శివ కనెక్ట్ కాలేదు… ఆ తర్వాత సమంత ఇన్వాల్వ్ అయ్యింది