రోజురోజుకు ఏపీలో టీడీపీ, వైసీపీ నేల మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. సీఎం జగన్ పై టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి అనుచిత వ్యాఖ్యలు, టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలతో ఏపీలో నిరసన జ్వాలలు చెలరేగాయి. అంతేకాకుండా గత పది రోజుల నుంచి వైసీపీ, టీడీపీ శ్రేణులు ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. చంద్రబాబు టెర్రరిస్టు అంటూ ఇటీవల విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు కౌంటర్ ఇచ్చారు.…