Minister Venugopala Krishna: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఆంధ్రప్రదేశ్ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ.. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు సైకోలా ప్రవర్తిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. చంద్రబాబుకు మతిస్థిమితం తప్పింది, అందుకే ప్రజలు విస్మరించారని వ్యాఖ్యానించారు.. అయితే, చట్టాలను గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉంది.. కానీ, వాటిని గౌరవించకుండా సంఘ విద్రోహ చర్యలకు నువ్వు పాల్పడుతున్నావు అంటూ చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు..…
ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తుండటంపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్పందించారు. గత ప్రభుత్వం టీడీపీ హయాంలో విద్యుత్ ఛార్జీలను పెంచలేదా అని ఆయన ప్రశ్నించారు. ఎన్టీఆర్ ప్రవేశ పెట్టిన ఉచిత విద్యుత్ పథకాలను చంద్రబాబు తీసివేయలేదా అని నిలదీశారు. గతంలో విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలపై భారం వేసింది తెలుగుదేశంపార్టీనే అని మంత్రి వేణుగోపాలకృష్ణ స్పష్టం చేశారు. ప్రజలను ఏదో విధంగా దృష్టి మరల్చడమే టీడీపీ లక్ష్యంగా కనిపిస్తోందన్నారు.…
అధికార వైసీపీ నేతలకు విపక్ష టీడీపీ నేతల మధ్య సవాళ్ళ పర్వం కొనసాగుతోంది. తాజాగా టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మంత్రి వేణు గోపాల కృష్ణ కు సవాల్ విసిరారు. బీసీలను రెండు ప్రభుత్వాల్లో ఏది ఆదుకుందో బహిరంగ చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు అయ్యన్నపాత్రుడు. ప్రచారం కోసమే 56 కార్పొరేషన్లు… కూర్చోవడానికి కుర్చీలు కూడా లేవన్నారు. రాజకీయాల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది ఎన్టీఆరే అన్నారు అయ్యన్న. చంద్రబాబు తీసుకొచ్చిన ఆదరణ, పెళ్లి…