అంగన్వాడీల సమస్యలపై సచివాయలంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ.. అంగన్వాడీల డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. అంగన్వాడీలు సమ్మె విరమించి విధులకు హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ విరమణ తర్వాత ఇచ్చే మొత్తాన్ని లక్షకు పెంచామని గుర్తుచేశారు.
మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి వ్యాఖ్యలను ఖండిస్తున్నాను అని మంత్రి ఉషశ్రీ చరణ్ అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభావం ఏపీలో ఏమీ ఉండదు అని ఆమె పేర్కొన్నారు. మహిళలకు ఏపీలో పూర్తి స్ధాయి అవకాశాలు కల్పిస్తున్నారు.. డైవర్షన్ పాలిటిక్స్ టీడీపీకి కొత్తేం కాదు.. పవన్ కళ్యాణ్ కొత్తగా టీడీపీతో జతకట్టలేదు.. పవన్ టీడీపీతోనే ఉన్నారు అంటూ మంత్రి ఆరోపించారు.
రాష్ట్రంలో మంత్రి పదవి ఆశించిన నేతలకు వైసీపీ అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పగించింది. జిల్లా అధ్యక్షులు మీరే.. పార్టీ బాధ్యతలు మీవే.. నడిపించేది.. గెలిపించేది మీరే అనే క్లారిటీ ఇచ్చారు. మంత్రులకంటే మీరే ఎక్కువ అని కూడా సాక్షాత్తూ సీఎం చెప్పారు కూడా. అయితే ఇది పదవి అనుకోవాలా.. లేక కొత్త సమస్యలు తలకెత్తుకోవాలో అర్థంకాని పరిస్థితుల్లో పడ్డారు పార్టీ పదవుల్లోకి వచ్చిన నేతలు. కొందరు నాయకులు మాత్రం తమ ముందున్న సవాళ్లను లెక్క చేయకుండా ఉత్సాహంగా…