బాపట్ల జిల్లా రేపల్లె రైల్వేస్టేషన్‌లో అత్యాచారానికి గురైన బాధితురాలిని ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో మంత్రులు తానేటి వనిత, ఆదిమూలపు సురేష్, మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ సోమవారం ఉదయం పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ టీడీపీ నేతలపై ఆరోపణలు చేశారు. ఏపీలో జరుగుతున్న హత్యలు, అత్యాచార ఘటనల్లో ఎక్కువశాతం నిందితులు టీడీపీ వాళ్లే ఉన్నారని ఆమె వ్యాఖ్యానించారు. టీడీపీ నేతల ప్రమేయంతోనే ఏపీలో ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని మంత్రి తానేటి వనిత…