మంత్రి సవిత.. హిందూపురం ఎంపీ పార్థసారథి మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం సాగుతూ వచ్చింది.. అయితే, దానిపై క్లారిటీ ఇచ్చారు హిందూపురం ఎంపీ పార్థసారథి.. కార్యకర్తల్ని విస్మరిస్తే, వారిని కాపాడలేక పోతే నాయకులకు భవిష్యత్తు ఉండదని స్పష్టం చేశారు.. కానీ, మంత్రి సవితకు నాకు ఎటువంటి గొడవలు లేవు, కలిసే పని చేస్తాం అంటూ ఎంపీ పార్థసారథి వారి ఇరువురి మధ్య ఉన్న వైరానికి తెరదించారు.
Minister Savitha: గుంటూరులో వెనుకబడిన తరగతుల విద్యార్థులకు మెగా డిఎస్సీ ఉచిత శిక్షణా తరగతులను మంత్రి సవిత ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలు ప్రభుత్వం అని మరోకసారి నిరూపించిందన్నారు.
ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు కుమార్తె వివాహంలో రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళిశాఖ మంత్రి ఎస్.సవిత పాల్గొన్నారు. శనివారం హైదరాబాద్ లోని సిటాడెల్ కన్వెన్షన్ సెంటర్ లో శనివారం జరిగిన ఈ వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులు గాయత్రి సొనాక్షి, రుత్విక్ సాయిని మంత్రి సవిత ఆశీర్వదించారు.
బీసీలకు ఇచ్చిన ఎన్నికల హామీని అమలు దిశగా కూటమి ప్రభుత్వం అడుగులేస్తోంది. బీసీ రక్షణ చట్టం రూపకల్పనపై ప్రక్రియపై కసరత్తు జరుగుతోంది. రేపు సెక్రటేరీయేట్‌లో బీసీ మంత్రులు భేటీ కానున్నారు. రేపు మూడు గంటలకు 8 మంది బీసీ మంత్రులు భేటీ కానున్నారు. బీసీలకు మేలు కలిగేలా సీఎం చంద్రబాబు మరో నిర్ణయం తీసుకోనున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు.
ఏపీలో మరో ఎన్నికల హామీ అమలు దిశగా కూటమి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. బీసీ ప్రొటెక్షన్ యాక్టు రూపకల్పనకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ రూపొందించనున్నామని, ఈ మేరకు బీసీ ప్రొటెక్షన్ చట్టం రూపకల్పనపై సీఎం ఆదేశాలు జారీ చేశారని మంత్రి సవిత వెల్లడించారు.
అధికారులతో ఏపీ చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర, రాష్ట్రేతర పెట్టుబడుదారులతో మంత్రి సవిత వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొత్త టెక్స్‌టైల్ పాలసీపై చర్చించారు.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని గొల్లపూడిలో ఉన్న బీసీ సంక్షేమ భవన్ ను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, చేనేత & జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత సందర్శించారు. బీసీ సంక్షేమ భవన్‌లో ఉన్న వివిధ బీసీ కార్పొరేషన్ల విభాగాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ.. 2014- 19 లో చంద్రబాబు ప్రభుత్వంలో బీసీలకు పెద్దపెట్టవేశామని, 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం బీసీల అభ్యున్నతిని విస్మరించిందన్నారు. టీడీపీ పాలనలో బీసీ సంక్షేమ…