మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఆర్ కె రోజా బిజీ అయిపోయారు. వివిధ అధికారిక కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఆమె పర్యటించారు. అక్కడ బాస్కెట్ బాల్ పోటీలను ఆమె ప్రారంభించారు. తాజాగా విజయవాడలో ఆమె శాప్ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరాలను ప్రారంభించారు. నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ క్రీడాప్రాంగణములో శిక్షణా శిబిరాలను ప్రారంభించి ప్రసంగించారు. కరోనా వల్ల రెండు ఏళ్లు క్రీడాకారులు ఇళ్ళకే పరిమితం అయ్యారు. క్రీడలు ఆరోగ్యాన్ని, అవార్డులను తెచ్చి పెడతాయి. 48 విభాగాల్లో…