పోలవరం, బనకచర్ల, ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమీక్ష జరిగిందని.. తుపాన్ బారి నుంచి పంటలు కాపాడుకునే విధంగా చర్యలు తీస్కుంటున్నామని మంత్రి రామానాయుడు అన్నారు. పంట కాలాన్ని ముందుకు తీసుకు వచ్చే చర్యలు తీసుకోవాలని సీఎం చెప్పినట్లు తెలిపారు. నీటి లభ్యత బులెటిన్ విడుదల చేస్తామని.. పండించే పంటలకు అనుగుణంగా రైతులకు సూచనలు ఇస్తామని స్పష్టం చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలిలో గోదావరి ఏటిగట్టు పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. "జగన్ ఐదేళ్ల పాలనలో ఇరిగేషన్ శాఖను విధ్వంసం చేసి, కనీస మెయింటెన్స్ పనులు కూడా పట్టించుకోకపోవడంతో ఏటిగట్లు బలహీనపడి ప్రమాదంగా మారాయి. రాష్ట్రంలో ఇరిగేషన్ అత్యవసర పనులు నిమిత్తం చంద్రబాబు మంజూరు చేసిన రూ. 320 కోట్ల నిధుల పనులను మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాలి. జగన్ పాలనలో గోదావరి ఏటిగట్లకు ఒక్క రూపాయి…
రైతు సమస్యలను గుర్తించి ముఖ్యమంత్రి చంద్రబాబు సాగునీటి వ్యవస్థకు పునరుజ్జీవం తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. విజయవాడలో మీడియా వేదిక మంత్రి రామానాయుడు మాట్లాడుతూ.. సాగునీటి సంఘాల ఎన్నికలకు అంతా సిద్ధమని, జీవో విడుదలైందని తెలిపారు.