నూతన జిల్లాల ఏర్పాటులో ప్రజలు అభ్యంతరాలను ప్రభుత్వం దృష్టికి తెస్తే పరిష్కరించి ముందుకు వెళ్తామని మంత్రి కొడాలి నాని అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గుడివాడలో ఏదో జరిగిందని ఛీర్ బాయ్ లతో చంద్రబాబు కమిటీ ఏర్పాటు చేశారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు టీడీపీకి రాష్ట్రంలో ఏ అంశమూ లేదని, ఏ అంశం లేకే గుడివాడ అంశంపై గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేయడం…
ఏపీలో నూతన జిల్లాలపై రచ్చ జరుగుతోంది. ఇటీవల ఏపీ ప్రభుత్వం కొత్త జిల్లాలపై ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రకటనను కొందరు ఆహ్వానిస్తుంటే.. మరికొందరు తప్పుపడుతున్నారు. ఈ సందర్బంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. మూడు రాజధానులకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇచ్చిన హామీ మేరకు ప్రతి పార్లమెంట్ ను జిల్లాగా సీఎం జగన్ ప్రకటించారని ఆయన అన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం కొన్ని చోట్ల పలు ప్రాంతాలను కలిపారని, జిల్లాల పునర్విభజన…
ఇటీవల జగన్ సర్కార్ ప్రకటించిన నూతన జిల్లాల అంశం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. నూతన జిల్లాల అంశంపై టీడీపీ అధినేత పలు విమర్శలు గుప్పించారు. అయితే ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ నూతన జిల్లాల్లో ఓ జిల్లాకు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరు పెట్టడం జరిగిందని, జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినందుకు ఎన్టీఆర్ అభిమానిగా నేను ఎంతో సంతోషిస్తున్నాని అన్నారు. ఈ సందర్భంగా నా తరపున, ఎన్టీఆర్ ను దైవంగా భావించే…
టీడీపీ, బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు మంత్రి కొడాలి నాని. గుడివాడ ప్రజలకు సంక్రాంతి సంబరాలు ఎలా చేసుకోవాలో నేను నేర్పుతా అని సోమువీర్రాజు అంటున్నాడు. గుడివాడ ప్రజలకు సంక్రాంతి ఎలా చేసుకోవాలో తెలియదా? టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తులను పక్కన పెట్టుకొని..చంద్రబాబుకు అనుకూలంగా పనిచేస్తున్న వ్యక్తి సోము వీర్రాజు అని మండిపడ్డారు. గోవా కల్చర్ అంటున్నారు..గోవాలో ఉంది బీజేపీ ప్రభుత్వమే. గోవాలో ఎందుకు కాసినో కల్చర్ ను బ్యాన్ చేయడం లేదు. చంద్రబాబు శిష్యులు బీజేపీలో ఉన్నారు.…
గుడివాడ క్యాసినో ఘటన రోజురోజుకు ముదురుతోంది. తాజాగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రదేశ్ పేరు చేబితే మొన్నటి వరకు గంజాయి, డ్రగ్స్ గుర్తుకు వచ్చేవని.. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ పెరు చెబితే గుడివాడ , అందులో క్యాసినో గుర్తుకొస్తోందని ఆమె ఎద్దేవా చేశారు. అన్ని విధాలా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు సూపర్ సీఎం జగన్ అంటూ ఆమె వ్యాఖ్యానించారు. కానీ కొడాలి నాని గారు మాత్రం కరోనా తో హైదరాబాద్లో…
గుడివాడ ఘటనపై వైసీపీ,టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం చిలికి చిలికి గాలివానలా తయారైంది. తాజాగా టీడీపీ రాష్ట్రం కార్యదర్శి బుద్ధా వెంకన్న మంత్రి కోడలి నాని నిన్న చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. 2024లో వైసీపీ ఓడిపోయిన అరగంటలో ప్రజలు నిన్ను చంపుతారని, ఓడిపోగానే రాష్ట్రం వదిలి దుబాయి పారిపోతావు అంటూ ఎద్దేవా చేశావు. క్యాసినోలో రూ. 250 కోట్లు చేతులు మారాయి.. డీజీపీ నీకు వాటా ఎంత..? కొడాలి నానిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు..?…
ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ నడుస్తోంది. వైసీపీ నేతలకు టీడీపీ నేతలకు మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బుద్ధా వెంకన్న మాట్లాడుతూ.. చేతగాని దద్దమ్మ లు, చవటలు చంద్రబాబు పై మాట్లాడుతున్నారని తీవ్రంగా ధ్వజమెత్తారు. అరేయ్ కొడాలి నాని నీ భాష ఏంటి.. కొడాలి నాని నీ చరిత్ర ఏంటి రా.. గుడివాడ లో ఆయిల్ దొంగవి.. వర్ల రామయ్య నిన్ను లోపల వేసి…
ఏపీలో వైసీపీ నేతలకు టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తాజాగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బుద్ధా వెంకన్న మాట్లాడుతూ.. షర్మిల ఏపీలో పార్టీ పెడితే, అందులో చేరి జగన్ను బూతులు తిట్టే మొదటివ్యక్తి కొడాలినాని అని ఆయన విమర్శించారు. అంతేకాకుండా.. ప్రజలకు మేలు చేయటం చేతకాకే.. చంద్రబాబుపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారన్నారు. గుడివాడలో బస్సులు, లారీల్లో కొడాలి నాని ఆయిల్ దొంగతనం చేస్తే, అప్పుడు పోలీసు అధికారిగా ఉన్న వర్ల రామయ్య చర్యలు తీసుకోలేదా..?…
గుడివాడ క్యాసినో ఘటన ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది. విపక్షాలు గుడివాడ ఘటనపై విమర్శలు గుప్పిస్తుంటే.. అధికార వైసీపీ నేతలు మాత్రం గుడివాడలో ఎలాంటి క్యాసినో జరగలేదని, విపక్షాలు కావాలనే విమర్శలు చేస్తున్నాయని అంటున్నారు. అయితే తాజాగా ఈ ఘటనపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గుడివాడ క్యాసినో వివాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. క్యాసినో ఎక్కడ జరిగినా జరిగింది వాస్తవమా కాదా?…