ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ నడుస్తోంది. వైసీపీ నేతలకు టీడీపీ నేతలకు మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బుద్ధా వెంకన్న మాట్లాడుతూ.. చేతగాని దద్దమ్మ లు, చవటలు చంద్రబాబు పై మాట్లాడుతున్నారని తీవ్రంగా ధ్వజమెత్తారు. అరేయ్ కొడాలి నాని నీ భాష ఏంటి.. కొడాలి నాని నీ చరిత్ర ఏంటి రా.. గుడివాడ లో ఆయిల్ దొంగవి.. వర్ల రామయ్య నిన్ను లోపల వేసి చితక బాదాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు లేకుండా.. విజయవాడలో ప్లేస్, టైమ్ ఫిక్స్ చెయ్యి.. కొట్టుకుందాం రా.. అని సవాల్ విసిరారు.
గుడివాడలో వ్యభిచార కంపెనీ తీసుకు వచ్చావు, నోటి దూలతో కృష్ణా జిల్లా పరువు తీసావు, కొడాలి నాని తోపు అయితే కెమెరా పట్టుకోని చంద్రబాబు ఇంటికి వెళ్ళు.. చూద్దాం. చంద్రబాబు గేట్ తాకితే కొడాలి నాని శవాన్ని పంపుతా. మేమన్నా నీ బావ, బావ మరిదిలుమా..? మమ్మల్ని వాడు, వీడు అంటున్నావు. కొడాలి నానికి రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీ అని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు సీఎం అయిన తర్వాతే కొడాలి నానికి టీడీపీలో ప్రవేశం దొరికిందని, హరికృష్ణను మోసం చేసావు. 2004 లో నీకు టికెట్ ఇచ్చింది చంద్రబాబు.. హరికృష్ణ కాదు అని ఆయన అన్నారు.