పవన్ కళ్యాణ్ లాగా శ్రమ దానం చేయటంలో ఇదొక కొత్త ట్రెండ్ అని మంత్రి కన్నబాబు అన్నారు. సరిగ్గా ఒక నిమిషం 8 సెకన్లు శ్రమదానం పేరుతో ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఆయనది కెమెరా, యాక్షన్ లాంటి వైఖరి కాదా అని అన్నారు. మహాత్మా గాంధీ జయంతి రోజున వైసీపీ మీద యుద్ధం ప్రకటిస్తున్నాడు అనటం ఆశ్చర్యం కలిగించింది. వైసీపీ మీద యుద్ధం దేని కోసం ప్రకటించారు. కోవిడ్ కష్టకాలంలో కూడా లక్ష కోట్ల రూపాయలు నేరుగా…
గులాబ్ తుఫాన్ వల్ల ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కూడా పంట నష్టం జరిగింది అని వ్యవసాయ శాఖా మంత్రి కన్నబాబు తెలిపారు. భారీ వర్షాల కారణంగా ఒక లక్షా 56వేల 756 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని పేర్కొన్నారు. లక్షా 16 వేల ఎకరాల్లో వరి, 21వేల 78 ఎకరాల్లో మొక్కజొన్న ప్రధానంగా దెబ్బ తినింది. కృష్ణా జిల్లాలో సుమారు పదివేల ఎకరాల్లో పత్తి దెబ్బతినింది. అయితే ఇవి ప్రాథమిక అంచనాలు మాతర్మే అని…
మూడు రాజధానులు ప్రజల ఆకాంక్ష.. మూడు రాజధానులు వచ్చి తీరతాయని స్పష్టం చేశారు ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజల హృదయాల నుంచి ఉద్యమాలు పుడతాయి, కొంతమంది ప్రయోజనాల కోసం చేసే వాటిని డ్రామాలంటారు అని మండిపడ్డారు.. ప్రజల మనోభావాలను అర్థం చేసుకోకుండా చంద్రబాబు లాంటి సీనియర్ నేతలు వ్యవహరించటం ఆశ్చర్యం కలిగిస్తోందన్న ఆయన.. 600 రోజులు అయ్యాయని ఒక పండుగ వాతావరణం టీడీపీలో కనిపిస్తోంది.. రాష్ట్ర విభజన నాటి పరిస్థితులను…
ఇరిగేషన్ ప్రాజెక్టుల వ్యవహారం ఏపీ, తెలంగాణ మంత్రుల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది.. తాజాగా, ఈ వ్యవహారంపై స్పందించిన ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు… తెలంగాణ మంత్రులు మాట్లాడుతున్న భాష సంస్కారానికి సంబంధించిన అంశమని వ్యాఖ్యానించిన ఆయన… రాయలసీమ జిల్లాలు తాగు నీటి, సాగు నీటికి ఇబ్బందులు పడుతున్న ప్రాంతమని… కానీ, హీరోయిజం కోసం, రాజకీయాల కోసం వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవుపలికారు.. మరోవైపు.. వ్యవసాయ ఉత్పత్తులను ఎప్పటికప్పుడు కొనుగోలు చేస్తున్నామని.. చంద్రబాబు, లోకేష్ జూమ్…
ఒంటి చేత్తో పోరాటం చేసి నేడు ప్రజా సంక్షేమానికి పీట వేసిన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అని మంత్రి కన్నబాబు తెలిపారు. ప్రజలు పార్టీని కోరుకుంటున్నారని స్థానిక ఎన్నికల ద్వారా తెలిపారు. కుల, మతాలకు, పార్టీలకు అతీతంగా ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందిస్తున్నారు. లక్ష 25 వేళా కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లకు అంద చేసారు. 96% మ్యానిఫిస్టులో పెట్టిన పతకాలు అమలు చేసిన మనిషి మన ముఖ్యమంత్రి… 16 మెడికల్ కాలేజీలకు సోమవారం శంకుస్థాపన…
తాము చేయలేని పనులను వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తొందనే కడుపుమంట టీడీపీని నిలవనీయడం లేదంటూ ఎద్దేవా చేశారు మంత్రి కన్నబాబు.. గత రెండేళ్ల కాలంలో రూ. 83 వేల కోట్లు వ్యవసాయానికి.. రైతులకు ఖర్చు పెట్టామన్న ఆయన.. ఉచిత బీమా చెల్లింపులను టీడీపీ చిన్న విషయంగా చూస్తోందని ఫైర్ అయ్యారు.. రూ.3783 కోట్లు పంటల బీమా నిమిత్తం చెల్లించాం.. టీడీపీ హయాంలో కట్టాల్సిన బీమాను కూడా మేమే చెల్లించామన్న కన్నబాబు.. టీడీపీ హయాంలో రూ. 2900 కోట్లు…
మారుమూల గ్రామాలకు చెందిన రైతులకు సైతం ఆర్థిక చేయూతనిచ్చే లక్ష్యంతో మండలానికో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) శాఖలను ఏర్పాటు చేయబోతున్నట్టు రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. గ్రామీణ ప్రాంతానికి సంబంధించి ప్రస్తుతం 343 మండలాల్లో మాత్రమే డీసీసీబీ బ్రాంచ్‌లున్నాయని, మరో 332 మండలాల్లో బ్రాంచ్‌ల్లేవని, ఆయా మండలాల్లో రానున్న మూడేళ్లలో కొత్త బ్రాంచ్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది కనీసం 30 శాతం మండలాల్లో బ్రాంచ్‌లు ఏర్పాటు…