శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో సామాజిక సాధికారిక యాత్ర బహిరంగ సభలో మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలకవ్యాఖ్యలు చేశారు. దేశంలో 75 సంవత్సరాలలో రాష్ట్రాల్లో ఏర్పడిన ప్రభుత్వాలు తమ పార్టీకి ఓటు వేసిన వారికే సంక్షేమం ఇచ్చారని.. చంద్రబాబు పాలనలో జన్మభూమి కమిటీ ఏర్పాటు చేసి ప్రజల్ని బెదిరించి కొంతమందికి మాత్రమే సంక్షేమం అందించారని ఆయన వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంత్రి ధర్మాన ప్రసాదరావు లేఖ రాశారు. విశాఖలో ఫైనాన్షియల్ హబ్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్‌కు ధర్మాన లేఖ ద్వారా తెలిపారు.
ఎచ్చెర్లను ప్రజల కోరిక మేరకే శ్రీకాకుళం జిల్లాలో నియోజకవర్గం కొనసాగించామని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా చిలకలపాలెంలో సామాజిక సాధికార యాత్రలో మంత్రి ప్రసంగించారు. మత్స్యకారుడైన అప్పలరాజును మంత్రిని చేయడంతో బుడగట్లపాలెం, మంచినీళ్లపేటలో ఫిషింగ్ హార్బర్లు వచ్చాయన్నారు.
రాష్ట్రంలో విద్యుత్, పప్పు, నూనెల ధరలు పెరిగిన మాట వాస్తవమే.. కానీ, ధరలు పెరుగుదల ఒక్క ఆంధ్రప్రదేశ్ లో నే కాదు దేశం అంతటా ఇదే పరిస్థితి ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపారు మంత్రి ధర్మాన ప్రసాదరావు..