YSRCP Graph: ఒక్కసారిగా వైసీపీ గ్రాఫ్ పెరిగింది.. ఈ కార్యక్రమం మరింత పెంచుతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP Graph: ప్రభుత్వ కార్యక్రమాలు పార్టీకి అనుకూలంగా మలుచుకోవాలి.. ఎవరికి వారు నాయకులు ప్లాన్ చేసుకోండి అని సూచించారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. శ్రీకాకుళంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. జగనన్న సురక్ష కార్యక్రమంతో ఒక్కసారిగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ భారీగా పెరిగిందన్నారు.. అంతే కాదు.. ఆరోగ్య సురక్ష కార్యక్రమం కూడా పార్టీ గ్రాఫ్‌ను మరింత పెంచుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. మరోవైపు.. విజయవాడ, హైదరాబాద్ నుండి చంద్రబాబు కోసం డబ్బులు పంపిస్తున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు ధర్మాన.. చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా ధర్నాల కోసం, కొవ్వుత్తులు, టీషర్ట్‌లు సైతం పంపిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు.. ఇక, అసైన్ భూముల్లో చాలా అవినీతి జరిగింది అని ఆరోపించారు.. అమరావతి ప్రాంతంలో పేదల భూములను ధనవంతులు కొట్టేశారని.. అమరావతి ప్రాంతంలో అసైన్డ్ భూములు బడాబాబుల చేతుల్లోనే ఉన్నాయని విమర్శించారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.
Read Also: Shalini Pandey: ప్రీతి.. ఏంటి ఈ అరాచకం.. అర్జున్ రెడ్డి ఏమైపోవాలి
Also Read
కాగా, స్కిల్ డవలప్ మెంట్ కార్పొరేషన్ స్కామ్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి గతంలోనే సూచించారు మంత్రి ధర్మాన.. దర్యాప్తు సంస్థలకు సహకరించి.. చంద్రబాబు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలన్న ఆయన.. మీరు దర్యాప్తు సంస్థలను నమ్మడం లేదు.. ఇదే సమయంలో మేం మిమ్మల్ని నమ్మడం లేదు. మీరు ఈ విధంగా సభ్య సమాజాన్ని రెచ్చగొట్టే చర్యలను మానుకోవాలంటూ ధర్మాన వ్యాఖ్యానించిన విషయం విదితమే..
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?