సీఎం జగన్ పేదల కోసం ఆలోచిస్తే, చంద్రబాబు దృష్టి అంతా ధనవంతులు, దోపిడిదారులపై ఉంటుందని మంత్రి ధర్మాన ప్రసాద్ రావు పేర్కొన్నారు. పేద, ధనిక మద్య అంతరాలను తొలగించాలనే మార్పు జగన్ చేస్తున్నారు.. దేశంలో ఇతర ప్రాంతాలు కూడా అనుసరించాల్సిన పాలన ఇస్తున్నాం.
రుణమాఫీ చేస్తానని చెప్పి ఏపీ ప్రజలను చంద్రబాబు మోసం చేశాడు ఇప్పుడు మల్లీ మాయమాటలు చెప్తున్నాడని మంత్రి ధర్మాన ప్రసాద్ రావు అన్నారు. తప్పు చేస్తే మాకు మేము ప్రాయశ్చిత్తం చేసుకుంటాం.. కానీ చంద్రబాబు మాత్రం అలా కాదు అని ఆయన వ్యాఖ్యనించారు.
మర్మం లేకుండా మాట్లాడేస్తారు. మెలితిప్పే కామెంట్స్ అస్సలు ఉండవు. సూటిగా సుత్తిలేకుండా చెప్పేస్తారు. ఇన్నాళ్లూ ఆయన ఏం చెప్పినా చర్చే. ఇప్పుడు మాత్రం ఆయన మంత్రి. అభినందన సభలోనే నర్మగర్భ వ్యాఖ్యలతో కలకలం రేపారు. కాకపోతే ఆ ధర్మ సూక్తులు ఎవరికన్నదే ప్రస్తుతం ప్రశ్న. హాట్ టాపిక్‌గా మంత్రి ధర్మాన కామెంట్స్ ధర్మాన ప్రసాదరావు. తాజా మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో చోటు దక్కించుకున్నారు. చాలా గ్యాప్ తర్వాత మంత్రి హోదాలో జిల్లాకు రావడంతో అభిమానులు, పార్టీ కార్యకర్తలు శ్రీకాకుళం…