మున్సిపాల్టీల్లో సమ్మెలో ఉన్న సీఐటీయూతో మంత్రి ఆదిమూలపు సురేష్ చర్చలు ముగిశాయి. రెండున్నర గంటల పాటు మంత్రి, యూనియన్ నేతల మధ్య చర్చలు కొనసాగాయి. అయితే.. సీఐటీయూతో మంత్రి సురేష్ చర్చలు అసంపూర్తిగా ముగిసినట్లు తెలుస్తోంది. మరోవైపు.. సమ్మె విరమించాలని మంత్రి సురేష్ వారిని కోరారు. ఈ క్రమంలో.. చర్చల సారాంశాన్ని కార్మికులకు చెప్పి సమ్మె కొనసాగింపా..? విరమణా..? అనే విషయం తెలియచేస్తామని సీఐటీయూ చెప్పింది. కార్మికుల నుంచి క్లారిటీ తీసుకున్నంత వరకు సమ్మె కొనసాగిస్తామని సీఐటీయూ…
టీడీపీపై మంత్రి ఆదిమూలపు సురేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా న్యాయస్థానాల ముందు నిలబడాల్సిందేనని అన్నారు. అన్నీ ఆధారాలతోనే దర్యాప్తు సంస్థలు కేసులు పెట్టాయని.. ఎన్ని కేసులు పెట్టినా భయపడనని చెప్పిన లోకేష్ ఢిల్లీ వెళ్లి కూర్చున్నాడని మంత్రి తెలిపారు. 20 మంది అడ్వకేట్లను చుట్టూ కూర్చోబెట్టుకుని బెయిల్ కోసం ప్రార్దనలు చేస్తున్నారని ఆరోపించారు.