Bathinda military station firing: పంజాబ్ భటిండా మిలిటరీ స్టేషన్ కాల్పుల్లో నలుగురు జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో భటిండా పోలీసులు ఒక ఆర్మీ జవాన్ ను అరెస్ట్ చేశారు. అయితే ఈ అరెస్టును పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు. దీనిపై పోలీసులు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు.